ఒక్క బ్యాటరీ, అన్నింటికీ సరిపోతుంది.

ప్రీ-బుకింగ్ మొదలయ్యేది అక్టోబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు.

ఇప్పుడే ₹399కి ప్రీ-బుక్ చేయండి

నవంబర్ 6 నుంచి భారతదేశమంతటా షిప్పింగ్

ఇదిగో, సరికొత్త PowerPod Gen2.

మరింత స్మార్ట్, మరింత తేలికైన, ఇంకా సులువుగా తీసుకెళ్లగల EV బ్యాటరీ, ప్రతి భాగం ఒక ఉద్దేశంతో రూపొందింది. PowerPod Platform™ పునాదిపై రూపొందింది.

ఎత్తుకెళ్లడానికే తయారైంది.

బరువు తక్కువ. ఆలోచన ఎక్కువ. Gen1 కంటే 11% తేలిక, సైజు, ఆకారం మాత్రం అవే.

అన్నీ, ఒక్క చూపులో.

ఈ హ్యాండిలే మా గుర్తు. మొదటి నుంచీ అంతే. రెండు వంపులు కలిసే చోటే డిస్‌ప్లే ఉంది, అందుకే మీ ఫోన్ కంటే ముందే పాడ్ తానెలా ఉందో చెప్పేస్తుంది.

ఎలా పెట్టినా, మీరు కరెక్టే.

ఏ వైపు తిప్పినా ఒకేలా ఉండే కనెక్టర్, పెట్టడం ఇంకా సులువయ్యేలా రూపొందింది. ఆలోచించాల్సింది ఒకటి తగ్గింది.

మీ వెంటే వస్తుంది.

రైడ్ చేసేటప్పుడు సీటు కింద. రైడ్ అయ్యాక మీతో పాటే పైకి. ఏ సాకెట్ అయినా, ఎక్కడైనా, అదే ఛార్జింగ్ పాయింట్. 2.5 గంటల్లో ఫుల్, Gen1కి 4 గంటలు పట్టేది.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఒక్కటై.

పాడ్‌లోనే GPS, చుట్టూ దొంగతనం నుంచి రక్షణ. మీ లైవ్ లొకేషన్, ఒక్క ట్యాప్‌తో షేర్. అన్నీ మీ ఫోన్‌తో సింక్, ఇంటర్నెట్‌తోనూ, Bluetoothతోనూ.

నొక్కి చూడండి

మీతో మాట్లాడేంత స్మార్ట్.

Gen1 కంటే 4 రెట్లు ఎక్కువ ఇన్‌సైట్స్. ప్రతి రైడ్, ప్రతి ఛార్జ్, ప్రతి చిన్న వివరం, మీ అరచేతిలోనే.

నొక్కి చూడండి

5 ఏళ్ల వారంటీ.

3 ఏళ్ల స్టాండర్డ్ వారంటీ, కావాలంటే ఇంకో 2 ఏళ్లు పెంచుకోండి. వారంటీ నిబంధనలు చదవండి

మేడ్ ఇన్ ఇండియా. అణువణువూ మనదే.

భారత్‌లోనే, భారతీయులే డిజైన్ చేసి, ఇంజనీర్ చేసి, పరీక్షించారు. ప్రతి వంపు, ప్రతి సర్క్యూట్, ప్రతి కోడ్ లైనూ.

ప్రీ-బుకింగ్ మొదలయ్యేది అక్టోబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు.

ఇప్పుడే ₹399కి ప్రీ-బుక్ చేయండి

నవంబర్ 6 నుంచి భారతదేశమంతటా షిప్పింగ్